ఆస్కార్ విజేతలను కలిసిన ప్రధాని నరేంద్ర మోడీ

The Elephant Whisperers
The Elephant Whisperers |ఆస్కార్ అవార్డు పొందిన డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ టీమ్‌‌ను ప్రధాని నరేంద్ర మోడీ కలిసి అభినందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ప్రధాని అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. కాగా, ఇందులో డాక్యుమెంటరీ డైరెక్టర్ కార్తికీ గోన్సాల్వేస్, నిర్మాత గునీత్ మోంగా ఆస్కార్ అవార్డులను పట్టుకుని ఉండగా.. పీఎం వారితో కలిసి నిలబడ్డాడు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, కంటెంట్, మోనికా షెర్గిల్ కూడా ఫోటోలో ఉన్నారు. ‘‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అద్భుతం. ప్రపంచ దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బ్రిలియంట్ టీమ్‌ను కలిసే అవకాశం లభించింది. వారు భారతదేశం గర్వపడేలా చేశారు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Read Also: ‘అరి’ సినిమాపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి ప్రశంసలు

Follow us on: Google News, Koo, Twitter

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here