‘బలగం’ సింగర్ మొగిలయ్యకు తెలంగాణ సర్కార్ సాయం

-

Mogulaiah |ఏ అంచనాలు లేకుండా విడుదలైన బలగం(Balagam) సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. రెండు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.24 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా క్లైమాక్స్‌ వచ్చే సాంగ్ సినిమాకే చాలా పెద్ద ప్లస్‌గా మారింది. ఆ సీన్‌లో కంటనీరు పెట్టని ఆడియన్స్ లేరు అనడంలో సందేహం లేదు. అయితే, ఈ సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చే పాట పాడిన సింగర్ మొగిలియ్య స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీలు ఫెయిలై, వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలిసిన మంత్రి కేటీఆర్(KTR) వెంటనే స్పందించారు. వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఫోన్ చేశారు. అంతేగాక, మొగిలయ్య(Mogulaiah) ఇంటి నిర్మాణానికి కూడా ప్రభుత్వ పథకం వర్తింపజేసేందుకు కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని మొగిలియ్యకు చెప్పి ఆ దంపతుల్లో ధైర్యం నింపాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. మరోవైపు ఇప్పటికే బలగం సినిమా డైరక్టర్ వేణు యెల్దండి రూ.1 లక్ష సాయం అందించారు. త్వరలోనే దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి కూడా ఆర్థిక సాయం అందనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Read Also: ఆస్కార్ విజేతలను కలిసిన ప్రధాని నరేంద్ర మోడీ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...

AP Cabinet: కూటమి ప్రభుత్వంలో కొత్త ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ 

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నేడు (బుధవారం) కొలువుదీరనుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి...