తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ(PM Modi) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ(SC Classification) ప్రక్రియకు కమిటీని ఏర్పాటుచేయాలని కేబినెట్ సెక్రటరీతో పాటు ఉన్నతాధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో మాదిగల సంఖ్య గణనీయంగా ఉంది. ఈ ప్రక్రియ అమల్లోకి వస్తే వీరికి ఉద్యోగాలు సహా ఇతర విషయాల్లో రిజర్వేషన్లు, ఇతర ఫలాలు అందుతాయి.
నవంబర్ 11న హైదరాబాద్‌లో జరిగిన సభలో ఎస్సీ వర్గీకరణ(SC Classification)కు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలో ఓ కమిటీ వేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వర్గీకరణ కోసం మందకృష్ణ(Manda Krishna Madiga) చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఇప్పుడు వర్గీకరణ కోసం కమిటీని నియమిస్తున్నట్లుగా అదేశాలు జారీ చేశారు. దీంతో ఎమ్మార్పీస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మూడు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కనుంది. అయితే ఎన్నికల్లో లబ్దిపొందేందుకే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది.