కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా తొమ్మిదేళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ(PM Modi) స్పందించారు. ఈ తొమ్మిదేళ్లలో తాను తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలను మెరగు పరచడం కోసమే అని మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. ‘ఈ రోజు మనం దేశానికి సేవ చేసి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా నేను వినయం, కృతజ్ఞతతో నిండిపోయి ఉన్నాను. ఇప్పటి వరకు తీసుకున్న ప్రతి నిర్ణయం, తీసుకున్న ప్రతి చర్య ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే చేశాం. భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు మరింత కష్టపడి పనిచేస్తాం’ అని అన్నారు. కాగా మోడీ నేతృత్వంలో బీజేపీ(BJP) పాలనకు తొమ్మిదేళ్ల వార్షికోత్సవాన్ని బీజేపీ పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. ఈ సందర్భగా భారీ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్పెషల్ కాంటాక్ట్ క్యాంపెయిన్ పేరుతో నెల రోజుల పాటు దీనిని నిర్వహిస్తుండగా నేషన్ ఫస్ట్ నినాదంతో మోడీ(PM Modi) హయాంలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రణాళిక వేసింది.
Read Also:
1. యోగి ఆదిత్యనాథ్ పాలనలోనే ఇది సాధ్యం..!!
2. బుల్లెట్లు దింపుతా.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter