Naatu Naatu పాటకు ఆ దేశస్తుల స్టెప్పులు.. స్పందించిన ప్రధాని మోడీ

-

Naatu Naatu | దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటికే అనేక అవార్డులు సొంతం చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం తాజాగా.. అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా హాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ అవార్డ్స్ అందుకుంది. ఈ సందర్భంగా Naatu Naatu పాట మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ పాటకు కొరియన్స్ అందంగా డాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కొరియా ఎంబసీ ఇండియా ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోను ప్రధాని మోదీ రీట్వీట్ చేస్తూ ఇది చూసేందుకు ఎంతో బాగుందని.. టీం ఎఫర్ట్ ఎక్కువగా ఉందంటూ కామెంట్ చేశారు. కాగా, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న ఈ పాట.. ఇప్పుడు ఆస్కార్ కోసం నామినేట్ అయ్యింది.

- Advertisement -

Read Also:

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...