Prakash Singh Badal |పంజాబ్ మాజీ సీఎం కన్నుమూత

-

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాళీదళ్ నాయకుడు ప్రకాష్ సింగ్ బాదల్(Prakash Singh Badal) మరణించారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఆయన వారం  క్రితం మొహాలీ లోని ఫోర్టిస్ హాస్పిటల్ లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 95 ఏళ్ళ ప్రకాష్ సింగ్ చికిత్స పొందుతూ నిన్న రాత్రి(ఏప్రిల్ 25న) 8 గంటలకు తుది శ్వాస విడిచినట్లు హాస్పిటల్ డైరెక్టర్ అభిజీత్ సింగ్ వెల్లడించారు.

- Advertisement -

ఒక గ్రామ సర్పంచ్ స్థాయి నుండి అంచెలంచలు ఎదిగి 5 సార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రి గా సేవలందించారు. 30 ఏళ్ళ వయస్సులో మొదటిసారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపొందారు. 43 ఏళ్ళ వయస్సులో పంజాబ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా ఆయన రికార్డు సృష్టించారు. కేంద్రంలోని బీజేపీ తెచ్చిన కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడి బీజేపీ కూటమి నుండి బయటికి వచ్చారు.  అలాగే  రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానానికి వ్యతిరేకంగా, 2015 లో ఆయన(Prakash Singh Badal) అందుకున్న పద్మ విభూషణ్ అవార్డు ను సైతం వెనక్కి ఇచ్చేసారు.  ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: యూపీ సీఎం యోగిని చంపేస్తామని వార్నింగ్ కాల్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...