కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి అన్యాయానికి వ్యతిరేకంగా కలిసి పోరాడుతుందని అన్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra) అస్సాంలో ముగిసి పశ్చిమబెంగాల్ లోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తన యాత్ర బెంగాల్ లోకి ప్రవేశించినందుకు సంతోషంగా ఉందన్నారు.
ప్రజల మాట వినేందుకు, ప్రజల కోసం నిలబడేందుకు ఇక్కడికి వచ్చానని రాహుల్(Rahul Gandhi) పేర్కొన్నారు. తాము ద్వేషం అనే మార్కెట్ లో ప్రేమ అనే షాప్ ని స్టార్ట్ చేశామని తెలిపారు. ఆ ప్రేమను ఇక్కడ ప్రజలకు పంచుతామని అన్నారు. దేశంలో బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS).. ద్వేషం, హింస, అన్యాయాన్ని వ్యాప్తి చేస్తున్నాయని, వాటిని అరికట్టేందుకే తాము న్యాయ్ యాత్ర చేపట్టామని రాహుల్ గాంధీ అన్నారు.