Rahul Gandhi |సోనియా గాంధీ వంటపై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్

-

బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌(Lalu Prasad Yadav)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాహుల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లాలూ అద్భుతంగా వంట చేస్తారని ప్రశంసించారు. కానీ, అందరికంటే నాకు తల్లి సోనియా గాంధీ(Sonia Gandhi) వంట అంటేనే ఎక్కవ ఇష్టమని చెప్పారు. అయితే, తన తల్లి సోనియా గాంధీ వంట అంటే చెల్లి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)కి అస్సలు నచ్చదని కూడా చెప్పుకొచ్చారు. అంతేగాకుండా.. ఉదయం కాఫీ, సాయంత్రం టీ, స్వీట్స్ తినడానికి ఇష్టపడతానని అన్నారు. పానీపూరి తినాలనిపిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వెళ్తానని తెలిపారు. కాగా, ప‌రువున‌ష్టం కేసులో దోషిగా నిర్దారణ అయి రెండేళ్ల జైలుశిక్ష ఖరారు కావడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు. దీంతో ఆయన ఢిల్లీలో త‌న అధికార నివాసాన్ని శనివారం ఖాళీ చేశారు. ఈ బంగ్లాలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) 2005 ఏప్రిల్ 22 నుంచి నివాసం ఉంటున్నారు. సరిగ్గా అదే ఏప్రిల్ 22న ఆయన ప్రభుత్వ భవానాన్ని యాదృశ్చికంగా ఖాళీచేయడం గమనార్హం.

- Advertisement -
Read Also: హిండెన్‌బర్గ్ రిపోర్టుతో అందరికీ సినిమా అర్ధమైపోయింది: KTR

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...