దేశంలో ప్రజాస్వామ్యం ఉంటె.. నా అభిప్రాయం చెప్పగలను: రాహుల్ గాంధీ

0
Rahul Gandhi

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో ఆయన జరిగిన పరిస్థితిపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని, ప్రజాస్వామ్యం ఉన్నట్లయితే తనను పార్లమెంటులో మాట్లాడేందుకు అనుమతించాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తూ విదేశాల్లో దేశాన్ని అవమానించారన్న బీజేపీ ఆరోపణపై పార్లమెంట్‌లో మాట్లాడేందుకు ఇప్పటికైనా తనను అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ఈరోజు తాను సభకు వచ్చిన ఒక్క నిమిషంలోనే సభను వాయిదా వేశారని, తన భావాన్ని సభా వేదికపై పెట్టాలనే ఆలోచనతో పార్లమెంటుకు వెళ్లానని రాహుల్(Rahul Gandhi) తెలిపారు. భారత దేశంలో ప్రజాస్వామ్యం పనిచేస్తుంటే పార్లమెంట్‌లో తన అభిప్రాయం చెప్పగలనని, మీరు చూస్తున్నది భారత ప్రజాస్వామ్యానికి పరీక్షేనని వ్యాఖ్యానించారు. తనపై విమర్శలు చేసేందుకు ఆ నలుగురు కేంద్రమంత్రులకు ఇచ్చినట్లే ఒక ఎంపీకి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వబోతున్నారా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.

Read Also: అనుమతిస్తే లోపల.. లేదంటే.. బయట

Follow us on: Google News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here