కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వినూత్న కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఉదయం ఆయన హర్యానాలోని సోనీపట్(Sonipat) సమీపంలోని మదీనా గ్రామంలో పొలంలో దిగి, రైతులతో కలగలిసిపోయి, వరి నాట్లు వేశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రాహుల్ గాంధీ శనివారం ఉదయం హిమాచల్ ప్రదేశ్ వెళ్తూ మార్గమధ్యంలో మదీనా గ్రామంలో పొలాల్లో పని చేసుకునేవారిని చూశారు. వెంటనే కారును ఆపి, పొలంలో దిగి, ట్రాక్టర్‌తో దుక్కి దున్నారు. ఆ తర్వాత తన ప్యాంటును మోకాళ్ల పై వరకు మడిచి, పొలంలోకి దిగారు. రైతులు వరినాట్లు వేస్తున్న విధానాన్ని పరిశీలించి, తాను కూడా కొన్ని వరి మొక్కలను తీసుకుని, నాటారు. అనంతరం అక్కడి రైతులతోనూ, కూలీలతోనూ ఆయన(Rahul Gandhi) మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
हरियाणा में किसानों के बीच पहुंचे जननायक @RahulGandhi जी। pic.twitter.com/bfX3iUgkxt
— Congress (@INCIndia) July 8, 2023
Read Also: గాంధీభవన్ ఎదుట మునుగోడు MLA అభ్యర్థి ధర్నా
Follow us on: Google News, Koo, Twitter, ShareChat