ప్రమాదానికి కారణం ఇదే.. రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక

-

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక రూపొందించింది. సిగ్నల్ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని నివేదికలో పొందుపరిచింది. లూప్ లైన్‌లో ఆగి ఉన్న గూడ్సు రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టిందని వివరించింది. మెయిన్ లైన్‌పై వెళ్లేందుకే సిగ్నల్ ఇచ్చినా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ పొరపాటున లూప్ లైన్‌లోకి వెళ్లిందని పేర్కొంది. దీంతో అక్కడ ఉన్న గూడ్స్ రైలును వేగంగా ఢీకొట్టడంతో బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయని తెలిపింది.

- Advertisement -

అదే సమయంలో బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు రావడం.. పట్టాలపై పడి ఉన్న బోగీలను ఢీకొనడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని వెల్లడించింది. సిగ్నలింగ్‌లో మానవ తప్పిదం కారణంగానే ఇది జరిగి ఉండొచ్చని చెప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 1257 మంది రిజర్వ్‌డ్‌ ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌లో 1039 మంది రిజర్వ్‌డ్‌ ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. అయితే వీరు కాకుండా జనరల్‌ బోగీల్లో ఎంతమంది ఉన్నారన్నది తెలియరాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...