చంద్రయాన్-3 ల్యాండింగ్‌లో ఆ 17 నిమిషాలే కీలకం.. ఎందుకంటే?

-

సరికొత్త చరిత్ర సృష్టించేందుకు రెడీ అయింది ఇస్రో. మరికొద్దిగంటల్లోనే చంద్రయాన్‌-3(Chandrayaan 3) జాబిల్లిపై అడుగుపెట్టబోతోంది. రేపు సాయంత్రం 6గంటల 4 నిమిషాలకు చంద్రుని దక్షిణ ధృవంపై దిగబోతోంది విక్రమ్‌ ల్యాండర్‌. అయితే చంద్రయాన్‌-3 ల్యాండర్‌ మాడ్యూల్‌కు సంబంధించి ఏమైనా ప్రతికూల అంశాలు తలెత్తితే.. చంద్రుడిపై ల్యాండింగ్‌ తేదీని ఆగస్టు 27కి మార్చనున్నట్లు తెలిపారు ఇస్రో డైరెక్టర్‌ నీలేష్‌ ఎం.దేశాయ్‌. ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు మాడ్యూల్‌ స్థితిగతులు, చంద్రుడిపై పరిస్థితులను అంచనా వేసి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

- Advertisement -

వాస్తవానికి రేపు సాయంత్రం 5.47కి ల్యాండింగ్‌ చేయాలని నిర్ణయించింది ఇస్రో. ఐతే చివరి నిమిషంలో చంద్రయాన్ 3 షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. ముందుగా అనుకున్న సమయానికంటే 17 నిమిషాలు ఆలస్యంగా 6.04కు ల్యాండింగ్‌ చేయాలని నిర్ణయించింది. అన్నీ అనుకున్నట్టు సక్రమంగా జరిగితే రేపు సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై సురక్షితంగా అడుగుపెట్టనుంది. మొత్తం ప్రపంచం ఈ అరుదైన ఘట్టాన్ని తిలకించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ చివరి 17 నిమిషాల్లో ల్యాండర్ స్వయంగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో ISRO నుండి ఎటువంటి కమాండ్ ఉండదు.

ఇప్పటికే చంద్రుడి ఉపరితలంపై అనువైన ప్రదేశంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం అన్వేషిస్తోంది విక్రమ్‌ ల్యాండర్‌. అందుకు సంబంధించి ల్యాండర్‌ కెమెరా తీసిన చిత్రాలను కూడా రిలీజ్‌ చేసింది ఇస్రో. ఈ మొత్తం మిషన్‌లో ఈ కెమెరా అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఇదే ల్యాండర్‌ దిగే ప్రదేశాన్ని చూపిస్తుంది. సరైన ప్రదేశంలో ల్యాండర్ దిగేలాగా సాయం చేస్తుంది. ల్యాండర్ దిగే చోట ఎత్తు పల్లాలు ఉండకూడదు. రాళ్లు ఉంటే ప్రమాదం. అలాంటివి లేని చోట ల్యాండర్ దిగేలా చేసేందుకు ఈ కెమెరా చక్కగా ఉపయోగపడుతుంది.

ఇక చంద్రయాన్‌-2 చివరి నిమిషంలో విఫలమవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఈ సారి అలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు చేపట్టారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చంద్రుడిపై కాలు మోపేలా ల్యాండర్‌ను తీర్చిదిద్దారు. మరోవైపు సుమారు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘లూనా-25’ చివరి నిమిషంలో విఫలమైంది. ల్యాండర్‌ను చంద్రుడి చివరి కక్ష్యలోకి మార్చే క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్‌-3(Chandrayaan 3)ని చంద్రుని దక్షిణ ధృవంగా విజయవంతంగా దింపేందుకు మరింత కసరత్తు చేపట్టారు. ఇది కాస్తా పూర్తయితే చంద్రునిపై విజయవంతంగా దిగిన నాలుగవ దేశంగా ఇండియా చరిత్ర సృష్టించనుంది.

Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.లక్షా 40వేల జీతంతో ఉద్యోగాలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...