Wrestlers Protest |భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషన్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు తిరిగి విధుల్లోకి చేరినట్లు తెలుస్తోంది. రైల్వే శాఖకు చెందిన ఓఎస్డీ పోస్టుల్లో సాక్షి మాలిక్(Sakshi Malik), పూనియా మళ్లీ చేరారు. శనివారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)తో మహిళా రెజ్లర్లు భేటీ అయిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం ఆందోళన(Wrestlers Protest) విరమించినట్లు వచ్చిన వార్తలను సాక్షి మాలిక్ కొట్టిపారేశారు. తప్పుడు వార్తలు ప్రసారం అవుతున్నట్లు ఆమె తెలిపారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు అని సాక్షి మాలిక్ ట్విట్టర్‌లో వెల్లడించారు. రైల్వే ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నానని, కానీ న్యాయం దొరికే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.