Sharad Pawar | అజిత్ పవార్ తిరుగుబాటుపై శరద్ పవార్ రియాక్షన్ ఇదే

-

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు అజిత్ పవార్(Ajit Pawar) 30 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం రాజ్ భ‌వ‌న్‌కు చేరుకుని ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న అజిత్ పవార్ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిని పంచుకోనున్నారు. దీనిపై స్పందించిన ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్(Sharad Pawar).. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు వ్యక్తిగ‌తంగా వెళ్లార‌నీ, వారికి పార్టీ నుంచి ఎలాంటి మ‌ద్దతు లేద‌ని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా తొమ్మిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు చేసిన ప్రమాణ స్వీకారానికి పార్టీ అధికారిక మద్దతు లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధికార ప్రతినిధి మహేశ్ తపసే ఆదివారం తెలిపారు. ఎన్సీపీ పార్టీ కార్యకర్తలు, జిల్లా అధ్యక్షుడు, తాలూకా అధ్యక్షుడు, యువత, మహిళలు పార్టీ జాతీయ నాయకుడు శరద్ పవార్(Sharad Pawar) వెంట ఉన్నారని తపసే ఒక వీడియో సందేశంలో తెలిపారు.

- Advertisement -
Read Also:
1. మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...