Shilpa Shetty | శిల్పాశెట్టి ఫొటోలు వాడితే చర్యలు తప్పవు.. హెచ్చరించిన లాయర్..

-

ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి(Shilpa Shetty) భర్త రాజ్‌కుంద్రా(Raj Kundra)కు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తోందన్న వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారం చేసిన కేసు దర్యాప్తులో భాగంగా రాజ్‌కుంద్రా సహా కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల నివాసాలు, కార్యాలయాల్లో కూడా ఈడీ సోదాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై శిల్పాశెట్టి తరపు లాయర్ స్పందించారు.

- Advertisement -

ఈ సోదాలకు, శిల్పాశెట్టికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. శిల్పాశెట్టి నివాసంలో ఈడీ(ED) సోదాలు జరగలేదని తేల్చి చెప్పారు. రాజ్ కుంద్రాకు సంబంధించిన కేసులో విచారణ కొనసాగుతోందని, ఆయన కూడా అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నారని న్యాయవాది వివరించారు.

అదే విధంగా ఈడీ సోదాలు జరుగుతున్నట్లు ప్రసారమవుతున్న వార్తల్లో శిల్పాశెట్టి(Shilpa Shetty) ఫొటోలు, వీడియోలు వినియోగించడంపై కూడా న్యాయవాది ఘాటుగా స్పందించారు. వాటిని వాడొద్దని కోరారు. ఆమెకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని, ఒకవేళ ఈ వార్తల్లో ఆమె ఫొటోలను వినియోగిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read Also: ‘వడ్డీతో సహా తిరిగొస్తుంది’.. నయన్ వార్నింగ్ ధనుష్‌కేనా..!
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...

Mohan Babu | మోహన్ బాబుకి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం

ప్రముఖ నటుడు మోహన్‌బాబు(Mohan Babu)కి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం లభించింది....