Siddaramaiah and other congress leaders attend budget session with flowers over their ears: కర్ణాటక అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై నిరసన వ్యక్తం చేస్తూ.. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా చెవిలో పువ్వులు పెట్టుకొని అసెంబ్లీకి వచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందని సిద్ధరామయ్య మండిపడ్డారు. కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కర్ణాటక ప్రభుత్వం బడ్జెట్‌ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే, 2018 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే ఇంకా నెరవేరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో రెండు నెలల్లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సభ్యులు చేసిన నిరసన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. మరోపక్క ఎన్నికలే లక్ష్యంగా కర్ణాటక రైతులకు బడ్జెట్‌లో వరాలు కురిపించారు. వడ్డీలేని రుణ పరిమితిని రూ.2 లక్షల మేర పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. భూమి లేని మహిళా కూలీలకు నెలకూ రూ.500 ఆర్థిక సాయం అందించబోతునట్లు తెలిపారు.
Read Also