ప్రత్యేక సమావేశాలు: ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ

-

కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ ప్రధాన మోడీకి లేఖ రాశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏంటో తెలపాలని ఆమె లేఖలో డిమాండ్ చేశారు. ఇతర పార్టీలను సంప్రదించకుండానే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం ఏంటని ఆమె లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏంటో మాకు తెలియదు. మాకు అందిన సమాచారం ప్రకారం ఇది ప్రభుత్వ బిజినెస్ మాత్రమే అని తెలిసింది. అయినప్పటికీ మేము ఈ సమావేశాలకు హాజరవుతామని, ప్రజల సమస్యలపై చర్చించడానికి ఇదొక అవకాశంగా తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు సోనియా గాంధీ.

- Advertisement -

అంతేకాదు, ఎజెండాలో 9 అంశాలు చేర్చాలంటూ ఆమె రాసిన లేఖలో కోరారు. అదాని అక్రమాలు, మణిపూర్ అల్లర్లు, రైతు సమస్యలు, కనీస మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీలు, కులాల వారీగా జనగణన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రోజు రోజుకు దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాలు నుంచి ప్రజలను ఆదుకోవడం, హర్యానా సహా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చెలరేగుతున్న మత ఘర్షణలు, సరిహద్దుల్లో కొనసాగుతున్న చైనా ఆక్రమణలపై చర్చలు చేపట్టాలని సోనియా గాంధీ లేఖలో పేర్కొన్నారు.

కాగా, ఈనెల 18 నుండి బిజెపి ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రత్యేక సమావేశాలు అజెండా ఏంటి? ఎన్ని రోజుల వరకు జరగనున్నాయి? అనే విషయాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ప్రత్యేక సెషన్స్ పై ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా, 18 వ తేదీన పార్లమెంట్ సెషన్స్ పాత భవనంలో ప్రారంభించి.. 19 వ తేదీన వినాయకచవితి సందర్భంగా పార్లమెంట్ నూతన భవనంలో కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...