CM KCR: మోడీ నేతృత్వంలో కీలక సమావేశం.. కేసీఆర్ డుమ్మా..??

-

Sources that CM KCR will not attend for all parties meeting on G 20 held by modi: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జీ 20 సమ్మిట్ పై చర్చించేందుకు సోమవారం అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా దేశంలోని అన్ని పార్టీలకు కేంద్ర ప్రభుత్వం ఇన్విటేషన్స్ పంపింది. సెంట్రల్ ఆహ్వానం మేరకు ఏపీ నుండి వైసీపీ అధినేత, సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. కాగా ఈ కార్యక్రమానికి TRS పార్టీ అధినేత, తెలంగాణ సీఎం, కేసీఆర్ దూరంగా ఉండనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

- Advertisement -

బీజేపీపై ఒంటి కాలితో లేచే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. కానీ తెలంగాణ సీఎం అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరవనున్నారు అనే వార్త చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి డుమ్మా కొడతారు సరే, కనీసం పార్టీ తరఫున మరెవరైనా హాజరవుతారా లేదా అనేది మరొక డౌటు. ఎందుకంటే ఇప్పటివరకు అధికార టీఆర్ఎస్ నుంచి ఈ సమావేశానికి ఎవరు హాజరు అవుతారనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. కాగా ఈ ఏడాది భారత్ జీ20 కూటమికి అధ్యక్ష హోదా పగ్గాలు చేపట్టింది. ఈ క్రమంలో జీ20 అధ్యక్ష హోదాలో అనుసరించాల్సిన వ్యూహాలపై రాజకీయ పార్టీల అధ్యక్షుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పీఎం మోడీ ఈ సమావేశం నిర్వహస్తున్నారు.

ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ మీటింగ్ కు టీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంటుందా లేక చివరి నిమిషంలో పార్టీ ప్రతినిధిగా ఎవరినైనా పంపుతుందా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మోడీ అధ్యక్షతన సమావేశం జరగబోతున్న నేపథ్యంలో ఆయనకి ఎదురు పడటం ఇష్టం లేకే సీఎం కేసీఆర్ ఈ మీటింగ్ కు దూరంగా ఉంటున్నారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో  వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. గత నెలలో తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా చురకలంటించారు. ఇక సీఎం కేసీఆర్ సైతం మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు పీఎం ఈ మధ్య ఎప్పుడు తెలంగాణ పర్యటనకు వచ్చినా ప్రోటోకాల్ ప్రకారం ఆయననుఆహ్వానించేందుకు సీఎం ఎయిర్ పోర్టుకు వెళ్లడం లేదు. దీనిపై రాజకీయంగా రగడ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జీ 20 లక్ష్యాలపై చర్చించేందుకు కేంద్రం నిర్వహిస్తున్న సమావేశానికి కేసీఆర్ దూరంగా ఉండనున్నారనే టాక్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...