దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే జోరును కొనసాగించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 282 పాయింట్లు లాభపడి 64,364కి చేరుకుంది. ఇక నిఫ్టీ 97 పాయింట్లు పుంజుకుని 19,231కి చేరుకుంది. స్థిరాస్తి, మీడియా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు ఎక్కువగా ప్రాఫిట్ చవిచూశాయి.
టైటన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.
Stock Market | ఇండస్‌ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి.