మహిళా దినోత్సవం రోజున ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మాజీ ఛైర్‌పర్సన్, రచయిత్రి సుధామూర్తి(Sudha Murthi)ని రాజ్యసభకి నామినేట్ చేసినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సుధామూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. విద్యారంగంలోనే కాకుండా సమాజానికీ ఎంతో విలువైన సేవలు అందించారని కొనియాడారు.
“రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) సుధామూర్తిని రాజ్యసభకి నామినేట్ చేశారని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. సామాజిక సేవ, దాతృత్వం, విద్యారంగంలో ఆమె చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకం. రాజ్యసభలో ఆమె(Sudha Murthi) ప్రాతినిధ్యం నారీశక్తికి నిదర్శనం. దేశ సమర్థతని, మహిళల శక్తిని పెంచాలన్న మా లక్ష్యానికి ఇదో గొప్ప ఉదాహరణ” అని మోదీ తెలిపారు.