మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఫోటోలు, వీడియోలు ఎన్నికల ప్రచారంలో వినియోగించొద్దని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు సొంత కాళ్లపై నిలబడడం నేర్చుకోవాలంటూ చురకలంటించింది.
కాగా గతేడాది అజిత్ పవార్(Ajit Pawar) తన వర్గంతో కలిసి ఎన్సీపీ నుంచి చీలిపోయారు. అనంతరం మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ – షిండే సర్కార్ కు మద్దతు పలికారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవిని పొందారు. అంతేకాదు తన వర్గంలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉండడంతో వారినే అసలైన ఎన్సీపీ ఎమ్మెల్యేలుగా ఎన్నికల సంఘం గుర్తించింది. పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తు కూడా అజిత్ వర్గానికే దక్కాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న మహా ఎన్నికల ప్రచారంలో ఎన్సీపీ శరద్ పవార్(Sharad Pawar) ఫోటోలు, వీడియోలు వాడుతోందని ఆయన మద్దతుదారులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఎన్సీపీకి సీరియస్ గా ఆదేశాలు జారీ చేసింది.