Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసులో ఆగస్టు 7న తుది విచారణ

-

2002 గుజరాత్ లో జరిగిన గోద్రా అల్లర్ల తర్వాత గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానో(Bilkis Bano Case) పై జరిగిన సామూహిక అత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఈ ఘటనలో తన కడుపులో ఉన్న బిడ్డతో సహా ఏడుగురు కుటుంబీకులను బిల్కిస్ కోల్పోయింది. కాగా, ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న 11 మంది నిందితులను గుజరాత్ ప్రభుత్వం సత్ప్రవర్తన కారణంగా గతేడాది ఆగస్టు 15 న విడుదల చేసింది.

- Advertisement -

జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితులను ముందుగానే విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో(Bilkis Bano Case) సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై గత కొంతకాలంగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. కాగా ఈ కేసులో సోమవారం జరిగిన విచారణ అనంతరం.. తుది వాదనలు ఆగస్టు 7న వింటామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

Read Also: ఎన్డీఏ సమావేశానికి హజరవనున్న 38 పార్టీలు..?
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....