అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్(Hindenburg Research) సంస్థ ఆరోపణలతో పతనమైన అదానీ గ్రూప్‌పై(Adani Group) దర్యాప్తు చేస్తున్న సుప్రీంకోర్టు నిపుణుల బృందం సంస్థకు క్లీన్ చిట్ ఇచ్చింది. అలాగే, ఈ వ్యవహారంలో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వైఫల్యం కనిపించడంలేదని అభిప్రాయపడింది. ఇదే సమయంలో హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత రిటైల్ మదుపర్ల ప్రయోజనాలను కాపాడేందుకు అదానీ గ్రూప్ చేపట్టిన చర్యలను సుప్రీంకోర్టు కమిటీ సమర్థించింది.
అదానీ గ్రూప్ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, సెబీ నియంత్రణలో విఫలమైనట్టు టేల్చడం సాధ్యమయ్యే విషయం కాదని స్పష్టం చేసింది. తమ ప్రాథమిక దర్యాప్తులో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లలో ధరల అవకతవకలకు పాల్పడినట్టు కనిపించలేదని తెలిపింది. సంస్థ తీసుకున్న ఉపశమన చర్యల ద్వారా స్టాక్ మార్కెట్లలో విశ్వాసం పెంపొందించేందుకు సహాయపడిందని, ప్రస్తుతం కంపెనీ షేర్లు స్థిరంగా ఉన్నాయని కమిటీ వివరించింది. మరోవైపు అదానీ గ్రూప్(Adani Group) కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ విషయంలోనూ ఎలాంటి నియంత్రణ ఉల్లంఘణ జరగలేదని పేర్కొంది.
Read Also: భారత ఆధునిక చరిత్రలో నలుగురు గుజరాతీలదే కీలక పాత్ర: షా
Follow us on: Google News, Koo, Twitter