భారత ఆధునిక చరిత్రలో నలుగురు గుజరాతీలదే కీలక పాత్ర: షా

-

ఆధునిక భారతదేశ చరిత్రలో నలుగురు గుజరాతీలు కీలకపాత్ర పోషించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) తెలిపారు. శ్రీ ఢిల్లీ గుజరాతీ సమాజ్ ఏర్పాటై 125 ఏళ్లు పూర్తైన సందర్భంగా గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గుజరాతీలైన మహాత్మా గాంధీ(Mahatma Gandhi) , సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel), మొరార్జీ దేశాయ్(Morarji Desai), నరేంద్ర మోదీ(Narendra Modi) భారతదేశం ముందుకు వెళ్లడంలో కృషిచేశారని ఆయన వ్యాఖ్యానించారు. జాతిపిత మహాత్మాగాంధీ వల్ల దేశానికి స్వాతంత్ర్యం  సిద్ధిస్తే, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఏకం చేశారని పేర్కొన్నారు. అలాగే మొరార్జీ దేశాయ్ కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం పునరుత్తేజితం అయితే, నరేంద్ర మోదీ దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేశారని షా(Amit Shah) వెల్లడించారు.

- Advertisement -
Read Also: 18నెలలైనా సీఎం జగన్ ఏం చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక: పవన్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala | తిరుమలలో భారీ వర్షం.. సేదతీరిన భక్తులు..

తిరుమల(Tirumala)లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో గాలివానతో కూడిన భారీ వర్షం...

Dande Vital | బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు..

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక...