మీడియా సిబ్బందిపై ఎంపీ అవినాశ్ అనుచరుల దాడి.. గవర్నర్ తమిళిసై తీవ్ర ఆగ్రహం

-

Governor Tamilisai | కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు హైదరాబాద్ లో వీరంగం సృష్టించారు. మీడియా ప్రతినిధులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడటమే కాకుండా వాహనాలను ధ్వంసం చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య(Viveka Murder Case) కేసులో నేడు సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి హాజరుకావాల్సి ఉండగా.. తన తల్లి అనారోగ్యంతో ఉందని అనుచరులతో కలిసి పులివెందులకు బయలుదేరారు. దీనిపై సీరియస్ అయిన సీబీఐ అధికారులు మార్గమధ్యంలో అవినాశ్ రెడ్డి(YS Avinash Reddy)ని పట్టుకోవడానికి తమ వాహనాల్లో బయలుదేరారు. అదే సమయంలో దీనిని ప్రసారం చేసేందుకు మీడియా ప్రతినిధులు కూడా వాహనాల్లో అనుసరించారు. అయితే దారిలో మీడియా వాహనాలను అడ్డుకున్న అవినాశ్ అనుచరులు ఓ ఛానల్ రిపోర్టర్ పై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. కెమెరామెన్లను కొట్టి కెమెరాలను లాక్కొని పగులగొట్టారు. ఈ దాడుల్లో ఇద్దరు మీడియా ప్రతినిధులకు గాయాలయ్యాయి.

- Advertisement -

ఈ దాడి విషయాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకెళ్లగా.. మీడియా సిబ్బందిపై జరిగిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. మీడియా మీద దాడి.. ప్రజాస్వామ్యంపై దాడేనని ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్చలు తీసుకోవాలని ఆదేశించారు. మీడియాపై దాడిని ఏపీ, తెలంగాణ జర్నలిస్టుల సంఘాలతో పాటు ప్రజాసంఘాలు కూడా తీవ్రంగా ఖండించాయి. మరోవైపు ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరులు తమపై దాడి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు.

Read Also: భారత ఆధునిక చరిత్రలో నలుగురు గుజరాతీలదే కీలక పాత్ర: షా

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష ఉమ్మడి...

గుంటూరు లోక్‌సభ అభ్యర్థి ఆస్తులు రూ.5,785కోట్లు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. నామినేషన్లకు మరో రెండు రోజులు...