హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్(Vemula Rohith) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసలు రోహిత్ దళితుడు కాదని.. అతడి అసలు కులం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని స్పష్టంచేశారు. అతడు దళితుడని చెప్పేందుకు ఆధారాలు లేకపోవడంతో కేసును మూసివేస్తున్నామని వెల్లడించారు. దీంతో పోలీసుల పిటిషన్‌పై దిగువ స్థాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని రోహిత్ కుటుంబానికి న్యాయస్థానం సూచించింది.
పోలీసుల ప్రకనటతో ఈ కేసులో నిందితులుగా ఉన్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్‌రావు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు ఏబీవీపీ నేతలకు ఉపశమనం లభించింది. కాగా 2016లో హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్(Vemula Rohith) ఆత్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. దీనిపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు ఎనిమిదేళ్ల నుంచి దర్యాప్తు చేస్తున్నారు.