ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటనా స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పరిశీలించారు. ప్రమాదానికి జరిగిన గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. అనంతరం ప్రధాని(PM Modi) మీడియాతో మాట్లాడుతూ.. రైలు ప్రమాదానికి కారణమైన వారిని క్షమించబోమని అన్నారు. బాధ్యులు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రైలు ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ ప్రమాదం తనను కలిచివేసిందని ఎమోషనల్ అయ్యారు.