Surrogacy: నయనతార సరోగసి వివాదం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మరింది. నయనతార, విఘ్నేష్ దంపతుల పిల్లల వ్యవహారంపై విచారణ పూర్తి చేసిన త్రిసభ్య కమిటీ రేపు తమిళనాడు సర్కార్‌కు నివేదిక ఇవ్వనున్నారు. పెళ్లైన నాలుగు నెలలకే పిల్లల్ని కనడంతో (Surrogacy) సరోగసి వివాదం తెర పైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఘటన పై తమిళనాడు వైద్య శాఖ విచారణకు ఆదేశించి.. ఇందుకోసం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ కమిటీకి విచారణలో భాగంగా నయన్ తన సరోగసికి సంబంధించిన పూర్తి ఆధారాలను కమిటీకి సమర్పించినట్లు తెలుస్తుంది. నయన్ కమిటీకీ ఇచ్చిన ఆధారాలలో.. తాము ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని కమిటీకి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొందని సమాచారం. అంతే కాకుండా.. గత డిసెంబర్‌లో అద్దె గర్భం కోసం రిజిస్టర్ చేసుకొని, ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చినట్లు ప్రభుత్వానికి అందించిన అఫిడవిట్‌లో పేర్కొనట్లు తెలుస్తుంది. మరి రేపు తమిళనాడు సర్కార్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే..
Read also: రాజగోపాల్‌రెడ్డికి జ్వరం.. ప్రచారంలో ఈటెల