Complaint: చాక్లెట్లు దొంగతనం చేస్తోంది.. మా అమ్మను జైల్లో పెట్టండి

-

Complaint: మా అమ్మ నాకు కాటుక పెడుతుంది.. నా చెక్లెట్లు దొంగతనం చేస్తోంది.. మా అమ్మను జైల్లో పెట్టండంటూ పోలీస్‌ స్టేషన్‌కు వాళ్ల నాన్నను వెంటబెట్టుకొని వెళ్లాడో బుడతడు. పోలీసులు ఎంత సముదాయించినా, ఫిర్యాదు తీసుకోవాల్సిందే అంటూ పోలీస్‌ స్టేషన్‌లో భీష్మించుక్కూర్చున్నాడు. దీంతో చేసేదేమీ లేక ఎస్సై ఫిర్యాదు (Complaint) తీసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్‌ జిల్లా దేఢ్‌తలాయిలో జరిగింది. అమ్మపై మూడేళ్ల కొడుకుకు అంత కోపం రావటానికి కారణం ఏమిటో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

- Advertisement -

దేఢ్‌తలాయి గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు సద్దామ్‌కు వాళ్ల అమ్మ తల స్నానం చేయించాక కాటుక పెడుతుంది. చిన్న పిల్లలకు కాటుక పెట్టడం సహజమే కానీ.. సద్దామ్‌కు అది అస్సలు ఇష్టం లేదట. దీంతో తనకు కాటుక పెట్టవద్దని అల్లరి చేయటంతో ముద్దుగా చెంప మీద వాళ్ల అమ్మ చిన్న దెబ్బ వేసింది. ఇక అంతే.. సద్దామ్‌కు కోపం వచ్చేసింది. నాన్న నేను పోలిస్‌ స్టేషన్‌కు వెళ్లాలి.. వస్తావా.. రావా? అంటూ తండ్రి దగ్గరకు వెళ్లి ఏడుపు లఘించుకున్నాడు. ఎంత సర్ది చెప్పినా తండ్రి మాట వినకపోవటంతో.. సద్దామ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లాడు.

అక్కడే ఉన్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రియాంకా నాయక్‌కు సద్దామ్‌ జరిగిన విషయం మెుత్తం చెప్పి.. ఫిర్యాదు (Complaint) తీసుకోమని గుక్కపెట్టి ఏడ్చాడు. అలా కాదు మీ అమ్మకి కాటుక పెట్టవద్దని నేను చెప్తాను అంటూ ఎస్సై అన్నా.. ససేమేర సద్దామ్‌ ఒప్పుకోలేదు. ఇక తప్పక మోకాళ్లపై కూర్చొని మరీ, సద్దామ్‌ చెప్తుండగా, ఎస్సై ఫిర్యాదును తెల్లకాగితంపై రాశారు. చివరిలో సద్దామ్‌ సతకం కూడా తీసుకున్నారు. తన ఫిర్యాదు తీసుకున్న ఇన్‌స్పెక్టర్‌కు సద్దామ్‌ రెండు చేతులు జోడించి నమస్కారం చేసి ధన్యవాదాలు చెప్పాడు. ప్రస్తుతం ఈ టాపిక్‌ స్థానికంగా వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...

Kingfisher Beer Supply | కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ షాక్

Kingfisher Beer Supply | తెలంగాణలోని కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ...