GHMC: ఓ సివిల్ వివాదానికి సంబంధించి, కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసినా.. స్పందించకపోవటంతో జీహెచ్‌ఎంసీ (GHMC) కమిషనర్‌కు లోకేష్ కుమార్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోర్టుకు హాజరయ్యి, వారెంట్ వెనక్కి తీసుకోవాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఏజీ విజ్ఞప్తిని మన్నించిన ధర్మాసనం.. కమిషనర్‌పై జారీ చేసిన వారెంట్‌ను వెనక్కి తీసుకుంది. సయ్యద్ అసీమ్ ఓ సివిల్ వివాదానికి సంబంధించి, హైకోర్టులో సెకండ్ అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎం లక్ష్మణ్ ధర్మాసనం.. సోమవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ (GHMC) ప్రత్యక్షంగా హాజరయ్యి.. వివరాణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ కమిషనర్ హాజరు కాలేదు. దీనిపై కనీసం ఆయన తరఫున న్యాయవాదులు కూడా రిప్రజెంట్ చేయలేదు. దీంతో ధర్మాసనం కమిషనర్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ విషయంపై మధ్యాహ్నం కోర్టుకు హాజరై అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వారెంట్ వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థన మేరకు వారెంట్‌ను వెనక్కి తీసుకొని, ఈ నెల 27న కమిషనర్ వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.