Dc thanda: విద్యుత్ సరఫరా లేదని వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండా వాసులు, ఖమ్మం – వరంగల్ జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్నారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా తండా వాసులు మాట్లాడారు. వారం రోజులుగా 600 ఇండ్లకు విద్యుత్ సరఫరాను విద్యుత్ శాఖ అధికారులు నిలిపివేశారని కొంత మంది ఇండ్లకు మీటర్లు కూడా లేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.
- Advertisement -