West Bengal | ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగి.. 300 మందికి పైగా ప్రయాణికులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదాన్ని పూర్తిగా మరువకముందే మరోచోట రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం మరోసారి బయటపడింది. బాలాసోర్ రైలు ప్రమాద ఘటన కళ్లముందు కదలాడుతుండగానే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా మరో రైలు పట్టాలు తప్పింది. పశ్చిమ బెంగాల్(West Bengal )లోని బంకురా సమీపంలో లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో లోకో పైలట్‌కు తీవ్రగాయాలయ్యాయి. లూప్ లైన్‌లో ఒక ట్రైన్ ఉంటే అదే ట్రాక్‌పైకి మరో రైలు ఎందుకు వస్తుంది..? అదే పరిస్థితి ఎందుకు పునరావృతం అవుతుంది…? బాలాసోర్ లాగానే ఇప్పుడు సైతం ప్యాసింజర్ ట్రైన్ లైప్ లైన్‌లోకి వస్తే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల కారణంగా ఇప్పుడు రైలు ప్రయాణ భద్రతపై నీలినీడలు కమ్మకుంటున్నాయి.
Read Also:
1. గచ్చిబౌలి పీఎస్‌లో MLC పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు
2. మెగా ప్రిన్సెస్‌కు గ్రాండ్ వెల్కమ్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat