ఇప్పటి వరకు తెలుపు, నీలి రంగులో ఉన్న కనిపించే వందే భారత్ ట్రైన్స్(Vande Bharat Express) ఇప్పుడు కాషాయ రంగులో కూడా దర్శనమివ్వనున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెన్నైలోని రైల్వేస్ ప్రొడక్షన్ యూనిట్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించి, వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఉత్పత్తిలో పురోగతిని సమీక్షించారు. అధికారలతో చర్చించారు. ‘ఇది మేకిన్‌ఇండియా కాన్సెప్ట్‌తో చేస్తున్నది. ప్రయాణికులు ఇచ్చే విలువైన సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకొని కొత్త వాటిలో మెరుగైన వసతులు కల్పించడమే ధ్యేయంగా పని చేస్తున్నామని మంత్రి అన్నారు.
ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న జీ 20 సమావేశాల కారణంగా కాషాయ రంగు(Saffron Colour)లో ట్రైన్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే మినిస్ట్రీ ఆదివారం వందే భారత్(Vande Bharat Express) కాషయం, నీలి రంగు ట్రైన్ ఫోటోలు విడుదల చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు విమర్శలు, హర్షం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: కేటీఆర్.. మీ ఒక్క అమ్మమ్మ మాత్రమే సంతోష పడాలా?
Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat