సంచలన మార్పులతో ప్రతి నిత్యం వార్తల్లో నిలిచే ట్విట్టర్ సంస్థ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ లో బ్లూటిక్(Twitter Blue Tick) పొందేందుకు సబ్ స్క్రిప్షన్ ఫీజు చెల్లించాలని గతంలోనే ఆ సంస్ద అధినేత ఎలన్ మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా ఫీజు చెల్లించని సెలబ్రెటీల ఖాతాలకు బ్లూటిక్ తొలగిస్తూ ట్విట్టర్ తాజాగా నిర్ణయం తీసుకుంది. వీరిలో ఏపీ రాజకీయా నాయకులు సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు.
అలాగే దేశవ్యాప్తంగా పలువురి రాజకీయ నాయకులు, సినీ సెలబ్రెటీలు, స్టార్ క్రికెటర్ల ఖాతాలకూ బ్లూటిక్(Twitter Blue Tick) తొలగించింది. వారిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అలియాభట్, యోగి ఆదిత్యనాథ్, రాహుల్ గాంధీ లాంటి వారు ఉన్నారు.
తెలుగు హీరోల్లో చిరంజీవి, అల్లు అర్జున్, మంచు మనోజ్, రాంచరణ్, నాగచైతన్య, మోహన్ బాబు, వెంకటేశ్, అఖిల్ తదితరుల బ్లూ టిక్ తొలగించింది.
Read Also: సెక్స్ తర్వాత ఇలా చేస్తే మీ పార్ట్ నర్ హర్ట్ అయ్యే చాన్స్ ఉంది జాగ్రత్త..!
Follow us on: Google News, Koo, Twitter