2014 లొ మిత్రులు 2019లో శత్రువులు @ ఏపీ 2019 రౌండప్

2014 లొ మిత్రులు 2019లో శత్రువులు ఏపీ 2019 రౌండప్

0
112

రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో చెప్పలేము.. ముఖ్యంగా పొత్తుల విషయం చెబితే ఏపీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు వినిపిస్తుంది.. దీనికి కారణం ఆయన ఇప్పటికే రెండు సార్లు బీజేపీతో కలిసి పోటీ చేశారు, రెండు సార్లు బీజేపీని విమర్శించారు, దీంతో బీజేపీ కూడా విసిగిపోయింది చంద్రబాబుతో.

అయితే 2014 ఎన్నికలు చూస్తే అప్పుడు తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి… కాని ఆ సమయంలో ఆ పార్టీలు మూడు గెలుపు గుర్రాలుగా ప్రజల్లో విశ్వాసం పొంది అధికారంలోకి వచ్చారు, అయితే మళ్లీ 2019 ఎన్నికల సమయానికి ఎవరికి వారు విమర్శలతో ప్రత్యర్ది పార్టీలుగా మారిపోయి శత్రువులు అయ్యారు.

2019 ఎన్నికల్లో వైసీపీ ఎప్పటిలా సింగిల్ గా వెళ్లింది.. కాని జనసేన తెలుగుదేశం కూడా సింగిల్ గా పోటీ చేశాయి… అలాగే బీజేపీ కూడా సింగిల్ గా పోటీ చేసింది, కాంగ్రెస్ చతికిల పడిపోయినా అలాగే పోటీ చేసింది, కేవలం సింగిల్ డిజిట్ ప్రజా ఓటు బ్యాంక్ మాత్రమే సంపాదించారు వీరందరూ.. తెలుగుదేశం మాత్రం డబల్ డిజిట్ సాధించి ప్రతిపక్షంలో కూర్చుంది.