బిహర్ లో కూడా బీజేపీ – జేడీయూ వైరం @ 2019 పొలిటికల్ రౌండప్

బిహర్ లో కూడా బీజేపీ - జేడీయూ వైరం 2019 పొలిటికల్ రౌండప్

0
212

అయితే అందరూ చూసే బీహర్ రాష్ట్ర్రంలో కూడా ఈసారి ఎన్నికలు రసవత్తరంగాసాగాయి.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీహర్ కూడా మెజార్టీ తనది చూపిస్తుంది అనేది తెలిసిందే. గత ఎన్నికల్లో నితీష్ నేతృత్వంలోని జేడీయూ, బీజేపీకి వైరిపక్షంగా బరిలో నిలిచింది. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ వ్యతిరేక కాంగ్రెస్, ఆర్జేడీ కూటమితో జట్టుకట్టింది.

అయితే, తర్వాత సీన్ మారిపోయింది. బీజేపీ, జేడీయూలు మరోసారి ఒక్కటయ్యాయి. గత ఎన్నికల వైరాన్ని పక్కనపెట్టి.. ఈసారి ఒక్కటిగా కలిసి పోటీ చేశాయి.అయితే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అప్రతిహత విజయం ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. కేంద్ర మంత్రివర్గంలో తమకు రెండు బెర్త్ లు కావాలని జేడీయూ డిమాండ్ చేసింది.

అయితే అన్ని మిత్రపక్షాలకు ఒకటే ఇస్తున్నామని, మీకు కూడా ఇలానే ఉంటుందని బీజేపీ అధిష్టానం స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహం చెందిన బీహార్ సీఎం నితిష్ కుమార్ కేబినెట్ లో చేరబోమంటూ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా షాక్ లు ఇవ్వడం మొదలు పెట్టారు. తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో బీజేపి నుంచి ఎవరికి అవకాశం ఇవ్వలేదు. ఇలా బీహర్ లో కూడా బీజేపీ కి జేడీయూకి వరుస వివాదాలు వచ్చాయి. తర్వాత ప్రశాంత్ కిషోర్ కు కీలక బాధ్యతలు ఇచ్చి ఆయనని పార్టీలో తీసుకున్నారు జేడీయూ అధినేత నితీష్.