చీమలకు చంపాలనుకుంది చివరకు ప్రాణం తీసుకుంది.

చీమలకు చంపాలనుకుంది చివరకు ప్రాణం తీసుకుంది.

0
128

ఇంట్లో చీమలు ఎక్కువ అవుతున్నాయనే ఉద్దేశంలో ఒక మహిళ వాటిపై కిరోసిన్ పోసి చంపే ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయింది…. ఈ సంఘటన తమిళనాడు చెన్నైలో జరిగింది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

అమింజికరై పెరుమాల్ ఆలయం స్ట్రీట్ కు చెందిన సత్యమూర్తి కుమార్తె సంగీత… కుప్పకూలిన ఇంట్లో నుంచి చీమలు పెరిగిపోవడంతో వాటిపై కిరోసిన్ పోసినిప్పు పెట్టింది… ఆ తర్వాత ఆ మంటపై మరింత కిరోసిన్ పోసే క్రమంలో ఒక్కసారిగా ఆమె దుస్తులపై మంటలు అంటుకున్నాయి…

దీంతో ఆమె కెకలు వేయడంతో కుటుంబ సభ్యులు మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు… చికిత్స పొందుతూ మృతి చెందింది సంగీత… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…