బర్త్ డే రోజు 550 కేక్‎ల కట్..వీడియో వైరల్

Cut 550 cakes for birthday..video viral

0
117

ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజును గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటారు. అందుకోసం తమ స్నేహితులను, దగ్గరివాళ్లను పిలుచుకొని వేడుకలు చేసుకుంటారు. తమతమ స్థోమతకు తగ్గట్లు పార్టీలు ఇస్తూ.. కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. బర్త్ డే రోజు కేక్ కట్ చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణం. కానీ, ముంబైకి చెందిన ఓ వ్యక్తి మాత్రం తన పుట్టినరోజు సందర్భంగా ఏకంగా 550 కేకులు కట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కాండీవలికి చెందిన సూర్య రాతురి అనే వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా 550 కేకులను కట్ చేశాడు. సూర్య కేక్ లను కట్ చేస్తుండగా.. అతని స్నేహితులు, బంధువులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మూడు టేబుల్స్ మీద 550 కేకులను వరసగా అమర్చగా..సూర్య రెండు చేతులలోకి రెండు కత్తులను తీసుకొని.. వరుసగా కట్ చేస్తూ వెళ్లాడు. అతని స్నేహితులు చప్పట్లతో సూర్యను ఎంకరేజ్ చేశారు.

https://www.youtube.com/watch?v=TVQvqpYC6CI