వృద్ధ ప్రేమికుల ల‌వ్ స్టోరీ..నెట్టింట వైర‌ల్‌

Elderly lovers' love story..Nettinta viral

0
108

ఓ ఇద్ద‌రు వృద్ధులు వ‌య‌సుతో సంబంధం లేకుండా ప్రేమించుకున్నారు. ఆ వృద్ధ ప్రేమికుల ల‌వ్ స్టోరీ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. జిమ్ అడ‌మ్స్ (78) అనే వ్య‌క్తి 2017లో త‌న భార్య‌ను కోల్పోయాడు. అప్ప‌టికి జిమ్‌కు వివాహ‌మై 38 ఏండ్లు. ఇక భార్యను కోల్పోయిన అనంత‌రం జిమ్ ఒంట‌రిగానే జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు. జిమ్ రిటైర్డ్ ప్రొఫెస‌ర్ కాగా క‌రోనా టైంలో ఖాళీగా ఉన్న జిమ్ త‌న‌కో భాగ‌స్వామి కావాల‌ని అనుకున్నాడు.

దీంతో ఓ డేటింగ్ యాప్‌లో త‌న పేరు న‌మోదు చేసుకుని..స‌రైన భాగ‌స్వామి కోసం వెతుకుతున్నాడు. ఈ క్ర‌మంలో జిమ్‌కు ఆడ్రి (79) అనే ఓ మ‌హిళ డేటింగ్ యాప్‌లో ప‌రిచ‌య‌మైంది. ఒకేరోజులో వీరిద్ద‌రి మ‌న‌సులు క‌లియ‌డంతో ప్రేమ చిగురించింది. ఆడ్రి 33 ఏండ్ల క్రితం త‌న భ‌ర్త‌తో విడాకులు తీసుకొని ఒంట‌రిగా ఉంటోంది.

మొత్తానికి వీరిద్ద‌రి ప్రేమ బంధం..ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 25వ తేదీన పెళ్లి బంధంగా మారింది. జిమ్, ఆడ్రి పెళ్లి చేసుకున్న ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఆ జంట‌ను చూసిన నెటిజ‌న్లు.. క్యూట్ క‌పుల్స్ అంటూ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు.