కార్తీక మాసంలో ఇలా దీపం వెలిగిస్తే ఇక అంతా శుభాలే

కార్తీక మాసంలో ఇలా దీపం వెలిగిస్తే ఇక అంతా శుభాలే

0
122

కార్తీక మాసం ఆరంభం నుండే శివాలయాలు కిటకిటలాడుతాయి, స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు పొటెత్తుతారు, అంతేకాదు ఎక్కడా చూసినా శివయ్య భక్తులు కనిపిస్తారు, ఇక పంచారామాల్లో భక్తులు లక్షలాది మంది వస్తారు, అయితే ఈ కార్తీకంలో ఆకాశదీపం ప్రారంభం అవుతుంది.

ఉదయం, సాయంత్రం ఆలయాలు, పూజామందిరాలు, తులసి కోట వద్ద దీపారాధన చేస్తే ఇహ, పర సౌఖ్యాలు కలుగచేస్తుంది.
ఇక ప్రతీ సోమవారం ఇలా దీపాలు వెలిగిస్తే ఇంటికి చాలా మంచిది అంతేకాదు వ్యాపార ఉద్యోగాల్లో రాణింపు ఉంటుంది,
కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక పౌర్ణమి వంటి రోజుల్లో కచ్చితంగా దీపాలు వెలిగించాలి.

అసలు ఆకాశ దీపం అంటే ఏమిటి అంటే, సాయంకాల సమయంలో ఇంటి వాకిట్లో వెలిగించేది ఆకాశ దీపం. కార్తీక దీపంలో రెండు వత్తులు కలిపి రెండు రెండుగా వేయడం చేస్తారు, ఇలా చేయడం వల్ల ఇంటికి ఎంతో పుణ్యం. ఇంటి యజమానికి విజయం వస్తుంది, ఇక రెండు పూటలా స్నానం చేసి శివయ్యకు దీపం వెలిగిస్తే ఎంతో మంచిది.