మీ ఆధార్ కార్డు పోయిందా..? అయితే కొత్త ఆధార్ ని ఇలా ఈజీగా పొందొచ్చు..

Lost your Aadhaar card? But you can easily get a new Aadhaar like this.

0
114

మనకి ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్లు లో ఆధార్ కార్డు కూడా ఒకటి. చాలా మంది ఆధార్ కార్డును వారి ఇంట్లో ఉంచుతారు. అయితే ఒక్కో సారి ఆధార్ కార్డ్ ని మిస్ చేసుకుంటూ ఉంటాం.దీనితో మనం కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడతాము. ఎందుకంటే ఆధార్ కార్డ్ లేకుండా చాలా పనులు ఆగిపోతాయి. ప్రభుత్వం అందించే స్కీములు, మొబైల్ సిమ్ కార్డ్, క్రెడిట్ కార్డ్, గ్యాస్ కనెక్షన్ ఇలా ఎన్నో వాటికి ఆధార్ చాలా ముఖ్యం. ఒకవేళ కనుక ఆధార్ కార్డు పోయిందంటే ఎలా తిరిగి పొందాలి అన్న దాని గురించి ఇప్పుడు చూద్దాం.

మీరు కనుక ఆధార్ కార్డు పొందాలంటే ఆధార్ కార్డు నెంబరు వున్నా సరిపోతుంది. కార్డు ఉండాల్సిన అవసరం లేదు. లేదు అంటే వర్చువల్ ఐడి, ఎన్రోల్మెంట్ ఐడి అయినా అవసరం. మీ యొక్క ఆధార్ నెంబర్ తో పాటు ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ మీ వద్ద ఉంటే ఆధార్ కార్డు ఈజీగా మనం పొందొచ్చు. అయితే మరి ఆధార్ కార్డ్ ని ఎలా పొందాలి అనేది చూద్దాం.

దీని కోసం మీరు ముందు https://eaadhaar.uidai.gov.in/#/ పోర్టల్ కు వెళ్ళాలి. తరవాత ఎంఆధార్ మొబైల్ యాప్ ను ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకుని ఈ ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆధార్ ను https://eaadhaar.uidai.gov.in/genricDownloadAadhaar పోర్టల్ కు వెళ్లి డైరెక్ట్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీరు ఆధార్ పీవీసీ కార్డును సైతం తీసుకోవచ్చు. ఇది క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉంటుంది. దీని కోసం మీరు రూ.50 చెల్లించాలి. దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్లి కూడా పొందవచ్చు.