నైలు నది మన ప్రపంచంలోనే అతి పెద్ద నది, చాలా మందికి ఈ విషయం తెలుసు అయితే నైలు నది గురించి కొన్నివిషయాలు తెలుసుకుందాం..ఆఫ్రికాలో ఉత్తర వాహినిగా ప్రవహించే ఈ నది అక్కడ దైవంతో సమానం, ప్రపంచం లోకెల్లా అతి పొడవైన నది.
ఈ నది పొడవు 6650 కి.మీ.
నైలు నదికి ప్రధానంగా రెండు ఉపనదులున్నాయి. ఒకటి వైట్ నైల్, మరొకటి బ్లూ నైల్. వీటిలో రెండో ఉపనదిలో ఎక్కువ నీరు ప్రవహిస్తుంటుంది… ఎక్కువ భూమిని కూడా సారవంతం చేస్తుంది. కొన్ని లక్షల ఎకరాల పంట కోట్లాదిమందికి తాగునీరు ఇది అందిస్తుంది..
ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే వైట్ నైల్ బ్లూ నైల్ కంటే పెద్దది, ఈ రెండు ఉప నదులూ సూడాన్ రాజధాని ఖార్టూమ్ దగ్గర కలుస్తాయి. ఈ నది సుడాన్ నుంచి ఈజిప్ట్ వరకు చాలా భాగం ఎడారి గుండా ప్రవహిస్తుంది. ఈజిప్ట్ దేశం ఈ నది పైనే ఆధారపడి ఉంది, కొన్ని వేళ సంవత్సరాల నుంచి ఈనీరే అక్కడ ప్రాణాధారం..దేశంలో చాలా మంది ఈ నది పరీవాహక ప్రాంతాల్లోనే నివాసం ఏర్పరుచుకున్నారు. ఈ నది ప్రవహించే చోటు నుంచి కొన్ని లక్షల హెక్లార్ట అడవి కూడా పెరుగుతోంది.