రాశి ఫలాల పండితులకు కొత్త గండం : నెటిజన్ల సెటైర్

రాశి ఫలాల పండితులు రాశి ఫలాలు Astrology specialists

0
119

కరోనా రక్కసి మానవాళిని చిన్నాభిన్నం చేసేస్తున్నది. ప్రజల జీవితాలు తలకిందులవుతున్నాయి. లక్షల్లో చావులు, కోట్లల్లో కేసులతో జనాలు బిక్కుబిక్కుమంటూ కాలమెల్లదీస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో పత్రికలు, టివిలు, సోషల్ మీడియాలో రాశి ఫలాలు బోధించే వారికి కొత్త చిక్కు వచ్చి పడింది. అంటే అందరు రాశి ఫలాలు బోధించే వారికి అనలేము కానీ కొందరికి మాత్రం ఇబ్బంది వచ్చి పడింది.

ఒక రాశి ఫలాలు బోధించే పండితుడు ఒక రాశి గురించి చెబుతూ ఈ రాశి వారు వేడుకల్లో పాల్గొంటారు అని సెలవిచ్చారు. అయితే ప్రపంచమంతా కరోనాకాలం. దేశంలో లాక్ డౌనుల కాలమాయే. తెలుగు నేల మీద వేడుకలే బంద్ పెట్టిరి. మరి ఫలానా రాశి వారు వేడుకల్లో ఎలా పాల్గొంటారు అంటూ ఒక వ్యక్తి సోషల్ మీడియాలో సదరు రాశి పండితుడిని ప్రశ్నించారు.

అయ్యా రాశి ఫలాలు చెప్పే పండితులారా జర మీరు అప్ డేట్ కాండి అంటూ కొద్దిగ చురక కూడా వేశాడు. నిజమే కదా? ఇలాంటి వాటి విషయాల్లో రాశి ఫండితులు జరంత జాగ్రత్తగా ఉండక తప్పదేమో? పాత స్క్రిప్ట్ కాకుండా లెటెస్ట్ స్క్రిప్ట్ చెప్పాలేమో మరి. రాశి ఫలం గురించిన ఫొటో కింద కూడా ఇస్తున్నాం చూడండి.