మహిళలకి ప్రధాని మోడీ గుడ్ న్యూస్..రెండో కాన్పుకు కూడా డబ్బులు!

0
111

మహిళలకు గర్భం దాల్చడం అనేది దేవుడించిన వరం. మహిళలు గర్భం దాల్చడం వల్లనే మనం ఈ రోజు మీద భూమి ఇలా ఉన్నాం. అలాగే మహిళల కాన్పుల విషయంలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు మహిళలకు ప్రయోజనకరంగా ఉండే విదంగా కేంద్రం శుభవార్త చెప్పనుంది. ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన పథకాన్ని ఎక్స్టెండ్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.

అలాగే ఈ స్కీమ్ రూల్స్ ని కూడా మారుస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్స్‌పెండిచర్ ఫైనాన్స్ కమిటీ ప్రతిపాదనల ప్రకారం రెండో కాన్పుకు కూడా స్కీమ్ బెనిఫిట్స్ కలగనున్నాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఈ పధకం కింద ప్రతీ ఏడాది 51.7 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతోంది. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం మహిళలకు తొలి ప్రసవానికి రూ.5 వేలు అందిస్తోంది. ఇవి మూడు విడతల్లో లభిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ స్కీమ్ వర్తించదు.మాములుగా అయితే ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన పధకం తొలి కాన్పుకు మాత్రమే వర్తిస్తుంది. రెండో సారి వర్తించదు.

అయితే ప్రభుత్వం రెండో కాన్పుకు కూడా ఈ స్కీమ్‌ను వర్తింప జేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే రెండో కాన్పులో ఆడ పిల్ల పుడితేనే ఈ డబ్బులు అందించాలనే నిబంధన తీసుకురానున్నారు. అలాగే కొత్త రూల్స్ ని కూడా ప్రభుత్వం అమలు చేయనున్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ స్కీమ్ ద్వారా డబ్బులు ఇవ్వాలంటే భర్త ఆధార్ లేకుండానే మహిళలకు డబ్బులు చెల్లించాలని కేంద్రం అనుకుంటోంది. ఇప్పుడైతే తప్పని సరిగా భర్త ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే. కానీ కొత్త రూల్స్ అమలులోకి వస్తే అవసరం లేదు. ఈ రూల్స్ వలన రిలీఫ్ గా ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా డబ్బులు పొందాలంటే ఆశా వర్కర్ ని సంప్రదిస్తే చాలు.