కరోనా కాలంలో పార్లేజీ బిస్కెట్ అమ్మకాలు రికార్డ్

కరోనా కాలంలో పార్లేజీ బిస్కెట్ అమ్మకాలు రికార్డ్

0
407

మనలో చాలా మంది గ్లూకోజ్ బిస్కెట్ అంటే వెంటనే పార్లేజీ అని చెబుతాం.. ఎప్పటి నుంచో బిస్కెట్ల అమ్మకాల్లో కంపెనీ నిలబడిపోయింది, రుచి అలాగే ఉంటుంది క్వాలిటీ కూడా అలాగే నిలబెడుతుంది కంపెనీ.ఈ లాక్ డౌన్ వేళ చాలా మంది ఈ పార్లేజీ బిస్కెట్లు తెగ కొన్నారు, ఇక వలస కార్మికులకి కూడా ఇచ్చేందుకు ఈ బిస్కెట్లే ఎక్కువ కొనుగోలు చేశారు.

కంపెనీ ప్రారంభమైన 1938 నుంచి ఇప్పటి వరకు, ఇంత భారీ మొత్తంలో ఎప్పుడూ అమ్మకాలు జరగలేదని పార్లే ప్రతినిధులు చెప్పారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలలోనే అత్యధిక సేల్స్ నమోదయినట్లు వెల్లడించారు. మిగిలిన కంపెనీలు కూడా చాలా సేల్ చేశాయి బిస్కెట్లు, అయితే పార్లే పేదవాడికి కూడా అందుబాటులో బిస్కెట్స్ ధరలు పెడుతుంది.

ఐదు రూపాయల నుంచి బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది.ఇది కామన్ మాన్ బిస్కెట్ అని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. పార్లేజీ కంపెనీ ప్రతి రోజు 40 కోట్ల బిస్కెట్లు తయారుచేస్తుంది. కిలో బిస్కెట్లను రూ.77కే అమ్ముతుండడంతో అందరికీ పార్లేజీ చేరువయిందని అంటున్నారు. మొత్తానికి రికార్డు స్ధాయిలో అమ్మకాలు జరిగాయట.