ఉద్యోగులు అందరికి కేంద్రం పలు మార్గదర్శకాలు

ఉద్యోగులు అందరికి కేంద్రం పలు మార్గదర్శకాలు

0
31

ఈ వైరస్ తో ఇప్పటికే చాలా మంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు, ఒకరి నుంచి మరొకరికి సులువుగా ఇది వ్యాపిస్తోంది, అందుకే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి. కేంద్రం ఉద్యోగులకి దీనిపై పలు మార్గదర్శకాలు ఇచ్చింది, ఎవరికైనా ఇలాంటి జలుబు దగ్గు జ్వరం గొంతు నొప్పి ఉంటే ఆఫీసుకి రావద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవచ్చు.

కంటైన్మెంట్ జోన్లలో ఉన్న వారు ఉద్యోగాలకు రాకూడదు
వేరే ప్రాంతాల నుంచి మరో ప్రాంతానికి తిరిగి చేతికి క్వారంటైన్ స్టాంప్ ఉన్నా ఎవరూ డ్యూటీకి రాకూడదు
20 కంటే ఎక్కువ మంది సిబ్బంది, అధికారులు కార్యాలయానికి హాజరుకాకూడదు.
రోస్టర్ విధానాన్ని ఫాలో అవ్వాలి.
కార్యాలయాల్లో కూర్చీల మధ్య పది అడుగుల దూరం ఉండాలి
మాస్క్ ధరించి వర్క్ చేయాలి
వీలైతే హ్యాండ్ శానిటైజర్ టేబుల్ దగ్గర పెట్టుకోవాలి
ఆఫీసులకి వచ్చేవారితో దగ్గరగా మాట్లాడకూడదు
భౌతిక దూరం ఉద్యోగులు ప్రజలు అందరూ ఆఫీసుల్లో పాటించాలి
హళ్లల్లో సరైన వెంటిలేషన్ ఉండేలా వీలైనంతవరకు కిటికీలను తెరిచి ఉంచాలి.
చర్చలు మీటింగులు సాధ్యమైనంతవరకు నివారించాలి. ప్రతి అరగంటకొకసరి చేతులు కడుక్కోవడం తప్పనిసరి.
ఎలక్ట్రిక్ స్విచ్లు, డోర్ నాబ్స్, ఎలివేటర్ బటన్లు, హ్యాండ్ రైల్స్, వాష్రూమ్ ఫిక్చర్స్ వంటి తరచుగా తాకిన ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలి.