బడ్జెట్ –పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట – ఈ మూడు కొత్త విషయాలు తెలుసుకోండి

బడ్జెట్ --పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట - ఈ మూడు కొత్త విషయాలు తెలుసుకోండి

0
308

కేంద్రం తాజాగా బడ్జెట్ ని ప్రవేశపెట్టింది…ఈ ఏడాది ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయలేదు.
అంతేకాదు మరో గుడ్ న్యూస్ చెప్పింది పన్ను చెల్లింపుదారులకు… ఐటీఆర్ దాఖలు చేయాల్సిన పని లేదని ప్రతిపాదించింది. అయితే ఇది అందరికీ వర్తించదు. కేవలం సీనియర్ సిటిజన్స్కు అది కూడా 75 ఏళ్లకు పైన వయసు ఉన్న వారికి మాత్రమే.

ఇక వీరికి ఆదాయ మార్గం కేవలం వడ్డీ, పెన్షన్ ద్వారా మాత్రమే ఉండాలి… అలా కాకుండా వ్యాపారాలు ఇతర మార్గాల ద్వారా వస్తే కచ్చితంగా చెల్లించాల్సిదే.. కేవలం వడ్డీ, పెన్షన్ ద్వారా వచ్చే వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించారు… ఇక ఎల్ ఐసీ నుంచి ఐపీవో కూడా ఉంటుంది అని స్పష్టం చేశారు.

ఉజ్వల స్కీమ్ను మరింత విస్తరింప చేయనున్నారు… మరో విషయం ఏమిటి అంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని ఆవిష్కరించారు. పర్సనల్ వెహికల్స్ 20 ఏళ్ల తర్వాత, కమర్షియల్ వెహికల్స్ 15 ఏళ్ల తర్వాత ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇవి సరిగ్గా లేదు అంటే వీటిని స్క్రాప్ కింద లెక్కిస్తారు.. ఇక అలాంటి వెహికల్స్ తిరగకూడదు, ఇలా తిరిగే వెహికల్స్ వల్ల దారుణంగా కాలుష్యం పెరుగుతోంది.