బ్రేకింగ్ — బిల్ గేట్స్ ఇంట విషాదం

బ్రేకింగ్ --- బిల్ గేట్స్ ఇంట విషాదం

0
509
Bill Gates

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలియని వారు ఉండరు.. దాదాపు 10 ఏళ్లకు పైనే ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఆయన ముందు వరుసలో నిలిచారు, తాజాగా ఆయన ఇంట విషాదం నెలకొంది.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తండ్రి విలియమ్ గేట్స్ తుదిశ్వాస విడిచారు.

బిల్ గేట్స్ తండ్రి వయసు 94 ఏళ్లు, ఆయన తన కొడుకు ఎదుగుదల బాగా చూశారు, తన తండ్రి అంటే గేట్స్ కు ఎంతో ఇష్టం, దాదాపు కుటుంబం సభ్యులు అందరూ ఇంటిలో ఉండగానే ఆయన తుదిశ్వాస విడిచారు.

గత కొంత కాలంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని… ఈ సమయంలో జీవితంలో తప్పకుండా జరగాల్సిన రోజు కోసం తామంతా మానసికంగా సిద్దమయ్యామని తెలిపారు. తన తండ్రిని ఎంతగా మిస్ అవుతామో మాటల్లో చెప్పలేమని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి ఎంతో గొప్ప వ్యక్తి అని ఉదారభావం కలిగిన వ్యక్తి అని ఆయన అన్నారు, బిల్స్ గేట్స్ స్థాపించిన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ లో ఆయన చురుకుగా ఉండేవారు ఏ సాయం కావాలి అన్నా ఆయన కూడా చేసేవారు,.