మరో సారి చేతులకు పని చెప్పిన బాలయ్య… సోషల్ మీడియాలో వైరల్

మరో సారి చేతులకు పని చెప్పిన బాలయ్య... సోషల్ మీడియాలో వైరల్

0
443

ప్రార్థించే చేతులకన్నా సాయం చేసే చేతులు మిన్నా అని అన్నారు మదర్ థెరిస్సా… అయితే హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య మదర్ థెరిస్సా అడుగు జాడల్లో నడుస్తున్నారు.. ఏదైనా సమస్య తన దృష్టికి వస్తే తనవంతు సహాయం చేస్తూ దేవుని రూపంలో మనిషిగా వచ్చారు మా బాలయ్య అంటున్నారు అభిమానులు… ఒక న్యూస్ పేపర్ లో వచ్చిన కథనాన్ని చూసి ఓ బాలికకు సహాయం అందించారు…

అనంతపురం జిల్లా సోమనాథ్ నగర్ లో నివాసం ఉంటున్న వెంకట్రాముడు అరుణ దంపతులకు కుమార్తే స్వప్న ఉంది… ఈ బాలిక కొద్దికాలంగా బోన్ క్యాన్స్ తో బాధపడుతోంది… వెంట్రాముడు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నారు… కుటుంబ పరిస్థితి అంతంతగానే ఉంది… స్వప్నకు మెరుగైన వైద్యం అందివ్వలేని పరిస్ధితిలో కుమిలి పోతున్నారు… తాజాగా స్వప్న దినగాథపై ఒక వార్తా పత్రికలో కథనం ప్రచురించారు…

ఈ విషయాన్ని పార్టీ అనుచరులు బాలయ్య దృష్టికి తీసుకువెళ్లారు… దీంతో వెంటనే బాలయ్య స్పందించారు… జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ గౌస్ మొయిద్దీన్ అలాగే ఆర్టీసీ చైర్మన్ లను స్వప్న ఇంటికి పంపారు.. స్వప్న తల్లిదండ్రులతో బాలయ్య స్వయంగా ఫోన్ లో మాట్లాడి దైర్యం చెప్పారు…

స్వప్నకు ఆపరేషన్ తానే చేయిస్తానని చెప్పారు… వెంటనే హైదరాబాద్ కు రావాలని చెప్పారు… ఆపరేషన్ కు సంబంధించిన ఏర్పాట్లను చేయిస్తానని చెప్పారు… ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బాలయ్యను తెగ పొగిడేస్తున్నారు… ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలయ్య వైరల్ అవుతున్నారు…