యార్లగడ్డ వెంకట్రావు కు జగన్ కొత్త ఆఫర్

యార్లగడ్డ వెంకట్రావు కు జగన్ కొత్త ఆఫర్

0
418

వల్లభనేని వంశీ మోహన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇస్తే అక్కడ వైసీపీ నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు పరిస్దితి ఏమిటి.. ఇది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న అంశం.. ఇదే విషయంలో వెంకట్రావు కూడా ఆలోచన చేస్తున్నారు. అయితే వంశీ ఇప్పుడు వైసీపీలోకి వచ్చే పరిస్దితి కనిపిస్తోం.. అయితే గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు చాలా తక్కువ ఓట్ల తేడాతో వైసీపీ తరపున ఓటమిపాలయ్యారు, మరి ఇప్పుడు ఆయనకు సీటు దక్కితే కచ్చితంగా గెలుస్తారు అని చెబుతున్నారు పార్టీ కేడర్.

వీరిద్దరి మధ్య గన్నవరంలో టఫ్ ఫైట్ సాగింది. ఫలితాల విడుదలకు ముందే యార్లగడ్డ ఇంటికి వెళ్లి వంశీ మోహన్ చాలా హడావుడి చేశారు. దీంతో వారి మధ్యన విబేధాలు తీవ్ర స్థాయికి వెళ్లాయి. జగన్ కూడా యార్లగడ్డకు వెనుక ఉన్నారు, అయితే వంశీ గెలిచిన తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో అనుకున్న పనులు మాత్రం వంశీకి జరగడం లేదు. గతంలో వీరు ఇద్దరు మిత్రులుగానే ఉండేవారు.. పార్టీలు వేరైనా వెంకట్రావు -వంశీ ముందు సన్నిహితులేనట, కాని రాజకీయంగా ఒకేస్ధానం నుంచి పోటీ చేయడంతో వీరిద్దరి మధ్య మరింత విభేదాలు వచ్చాయి.

తాజాగా మరో వార్త వినిపిస్తోంది…యార్లగడ్డకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేస్తున్నారని – ఉప ఎన్నికల తర్వాత ఆ పదవి వరిస్తుందని ఆయనకు చెప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వంశీ పార్టీలోకి వస్తే ఆయన పోటీ చేస్తాను అంటే వంశీకి టికెట్ ఇస్తారు.. లేకపోతే యార్లగడ్డ వెంకట్రావుకి టికెట్ ఇస్తారట మరి చూడాలి ఇక్కడ రాజకీయం ఎలా మారుతుందో.